కలం, వెబ్ డెస్క్ : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) ప్రారంభమైంది. ఈ మంత్రి మండలి సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దాదాపు 30కి పైగా కీలక అజెండా అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధాని అమరావతి పనుల పురోగతి, కొత్త పెట్టుబడుల ఆమోదం వంటి కీలక విషయాలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే, తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడాకులు తీసుకుంటున్న ప్రకటించిన మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ మంత్రివర్గ సమావేశానికి హాజరుకావడం విశేషం. ఈ మేరకు సచివాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు, ఇతర కేబినెట్ మంత్రులు స్వాగతం పలికారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించనున్నారు.
Also Read : ఐఓఏలో కీలక బాధ్యతలు.. సింధుపై జగన్ ప్రశంసలు
Follow Us On : WhatsApp

