కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) కు అభినందనలు తెలిపారు. భారత ఒలింపిక్ సంఘం (IOA) అథ్లెట్ల కమిషన్ ఛైర్పర్సన్గా ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా సింధు నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. భారత క్రీడారంగాన్ని బలోపేతం చేయడంలో ఆమె విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ జగన్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.
కాగా నవంబర్ 6వ తేదీన పీవీ సింధు (PV Sindhu) భారత ఒలింపిక్ సంఘం అథ్లెట్ల కమిషన్ ఛైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవంబర్ 7వ తేదీన ఆమె ఎన్నికను ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. సింధుతో పాటు వైస్ చైర్ పర్సన్ గా హర్మన్ ప్రీత్ సింగ్ కూడా అదే రోజున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Also Read : ఐఓఏలో కీలక బాధ్యతలు.. సింధుపై జగన్ ప్రశంసలు
Follow Us On : WhatsApp

