ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. పవన్ కల్యాణ్ హాజరు!

కలం, వెబ్ డెస్క్ : అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రి మండలి సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు.  రాష్ట్ర అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దాదాపు 30కి పైగా కీలక అజెండా అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాజధాని అమరావతి పనుల పురోగతి, కొత్త పెట్టుబడుల ఆమోదం వంటి కీలక విషయాలపై కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

అయితే, తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడాకులు తీసుకుంటున్న ప్రకటించిన మరుసటి రోజే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ మంత్రివర్గ సమావేశానికి హాజరుకావడం విశేషం. ఈ మేరకు సచివాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు, ఇతర కేబినెట్ మంత్రులు స్వాగతం పలికారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించనున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>