కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం (EVM Warehouse) కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. అగ్నిమాపక వ్యవస్థ పనితీరు తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని తెలిపారు. పటిష్ట అగ్నిమాపక వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, అర్బన్ తహసిల్దార్ రాజు, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

