రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి

కలం, నారాయణపేట: రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చాటిచెప్పేలా కొడంగల్‌లో సోమవారం సాయంత్రం నిర్వహిస్తున్న మెగా రైతు మేళా (Mega Rythu Mela) కు మక్తల్ నియోజకవర్గం నుంచి రైతులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన రైతుల బస్సులను లింగంపల్లి గ్రామం నుంచి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొన్నారు. రైతులకు అండగా నిలవడం, వారి కష్టాలను తగ్గించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సాగుకు అవసరమైన వసతులు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావిస్తున్న ప్రజా ప్రభుత్వం.. రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మెగా రైతు మేళా ద్వారా రైతులకు వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన మార్పులు, ఆధునిక సాగు విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కలుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా మక్తల్ నియోజకవర్గం నుంచి రైతులు పెద్దఎత్తున తరలిరావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>