కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ హారర్ అండ్ రొమాంటిక్ కామెడీ మూవీ “ది రాజాసాబ్” (The Rajasaab). వరుస మాస్ మూవీస్ తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న పక్కా ఎంటర్టైనింగ్ మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి 3 గంటల 9 నిముషాలుగా పేర్కొనింది. అయితే సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్మాణ సంస్థ లేఖ రాసింది. అయితే ఇక నుంచి ఏ సినిమాకు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చేదీ లేదన్న తెలంగాణ ప్రభుత్వం ఈ లేఖపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Read Also: అతడి వల్లే నా జీవితం నాశనం: పూనమ్ కౌర్
Follow Us On: Instagram


