కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ఓ డెలివరీ బాయ్ (Delivery Boy Death) బస్సు కిందపడి చనిపోయాడు. మంగళవారం టోలీచౌకీలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెప్టోలో పనిచేస్తున్న అభిషేక్ (25) అనే డెలివరీ బాయ్ డెలివరీ చేయడానికి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. వెనకాలే వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు యువకుడి తలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో అభిషేక్ అక్కడికక్కడే మరణించాడు. స్పాట్ లోనే అభిషేక్ చనిపోయినా.. ఆపకుండా వెళ్లిపోయిన బస్ ను స్థానికులు అడ్డుకుని డ్రైవర్ ను పట్టుకున్నారు. రోడ్డుపైనే మృతదేహం ఉన్నా వాహనదారులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: ‘SIR’ ఎఫెక్ట్.. యూపీలో 2.8 కోట్ల ఓట్లు తొలగింపు
Follow Us On: Pinterest


