వైసీపీకి భారీ షాక్.. బొత్స అనూష ఓటమి

కలం, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష (Botsa Anusha) జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారు. బొండపల్లి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. టీడీపీ అభ్యర్థి పాశల నీరజ చేతిలో 5,136 ఓట్లతో ఓటమి పాలయ్యారు. పొలిటికల్ అరంగ్రేటం చేసి బరిలోకి దిగిన అనూష.. మొదటి ఎన్నికల్లోనే పరాజయం పాలవడంతో ఆమె అనుచరులు, వైసీపీ శ్రేణులు నిరుత్సాహపడుతున్నారు.

విజయనగరం జిల్లాలో దాదాపు అన్ని జడ్పీటీసీ స్థానాలను టీడీపీనే క్లీన్ స్వీప్ చేసింది. రాజాం జడ్పీటీసీగా చీడి రూపవతి, సంతకవిటి జడ్పీటీసీగా వల్లూరు సంగీత, రేగిడి జడ్పీటీసీగా పాలవలస పుష్పవతి, వంగర జడ్పీటీసీగా మజ్జి గణపతి భారీ విజయం సాధించారు. చీపురుపల్లిలో వలిరెడ్డి శ్రీనివాసరావు 1,587 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

రాష్ట్ర వ్యాప్తంగా కూటమి హవా..

మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మాదిరే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు 440 జడ్పీటీసీ స్థానాలను గెలుపొందాయి. టీడీపీ 370, జనసేన 53, బీజేపీ 17 జడ్పీటీసీ స్థానాలు గెలుపొందాయి. వైసీపీ 38, ఇతరులు 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. ఇక ఎంపీటీసీ ఎన్నికల్లో 6,297 స్థానాలను గెలుచుకున్నాయి. టీడీపీ 5,450, బీజేపీ 135, జనసేన 712, బీజేపీ 135 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించాయి. వైసీపీ 1250, ఇతరులు 170 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

Also Read : టీడీపీ, వైసీపీల‌కు కాంగ్రెస్ షాక్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>