‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్

కలం, కరీంనగర్: సొంతింటి కల సాకారమై.. తమ ఇంట్లో తొలి దీపావళి జరుపుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ వెలుగులు నిండాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని లబ్ధిదారుల ఇళ్లలో పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఐడీఓసీలోని తన ఛాంబర్‌లో అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు మమేకమై దీపావళి వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగను జరుపుకోవాలని తెలిపారు.

సొంతింటి సంతోషాన్ని పండుగ సంబరాలతో పంచుకునేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ప్రతి లబ్ధిదారుడి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్ఓ స్వామి, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>