టీడీపీ, వైసీపీల‌కు కాంగ్రెస్ షాక్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఏపీ ప‌రిష‌త్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల (MPTC Elections) ఫ‌లితాలు నేడు వెల్ల‌డ‌య్యాయి. మెజార్టీ స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించారు. ప‌లు చోట్ల వైసీపీ అభ్య‌ర్థులు కూడా గెలుపొందారు. అనూహ్యంగా ఓ చోట కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. నెల్లూరు జిల్లాలోని వ‌డ్ల‌పూడి ఎంపీటీసీ (Vadlapudi MPTC) స్థానంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి త‌ల‌మ‌ల భార‌తి గెలుపొందారు.

ఈ స్థానం(Vadlapudi MPTC)లో ఎన్నిక‌ల‌కు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌, టీడీపీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డిచింది. ఈ పోరులో త‌ల‌మ‌ల భార‌తి టీడీపీ అభ్య‌ర్థిపై 283 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు 998 ఓట్లు రాగా, టీడీపీకి 715 ఓట్లు, వైసీపీకి 93 ఓట్లు వ‌చ్చాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు క‌నుమ‌రుగైపోయింది. రాష్ట్రంలో ఏ ఎన్నిక‌ల్లో కూడా ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది. తాజాగా ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపుతో పార్టీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : ఎంపీటీసీ ఫ‌లితాలు.. రోజా క‌న్నీళ్లు..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>