యువతకు ఆరోగ్య సందేశంతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరిన మారుతి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు ఎవరెస్టు బేస్ క్యాంపును (Everest Base Camp) అధిరోహించి సత్తా చాటాడు. నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన పర్వతారోహకుడు ఆర్మూర్ మారుతి (Armur Maruthi) నేపాల్‌లోని లుక్లా నుంచి అక్టోబరు 26న తన ఎవరెస్ట్ పయనం స్టార్ట్ చేసి గోరక్షేప్ చేరుకున్నారు. అక్కడి నుంచి 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకుని ఎవరెస్ట్ పై మన జాతీయ జెండాను ఆవిష్కరించాడు. ఆదివారం వరకు పర్వతం కిందకు రాబోతున్నాడు. అర్జెంటీనాలోని మౌంట్ అకాన్కాగువా పర్వతం అధిరోహించడం తదుపరి లక్ష్యమని మారుతి చెబుతున్నాడు.

‘ఆరోగ్యవంతమైన యువత, బలమైన భవిష్యత్తు’ అనే సందేశాన్ని తన యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. మారుతి.. మారుతి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఆటోమేషన్ ఇంజినీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2023లో ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, 2024లో రష్యాలోని మౌంట్ ఎక్స్ ప్రెస్ శిఖరాన్ని అధిరోహించాడు. మారుతి ఎవరెస్టు బేస్ క్యాంపు పర్వతం అధిరోహించడంపై నాలేశ్వర్ గ్రామస్థులు తోటి ఉద్యోగులు స్నేహితులు అతన్ని అభినందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>