కలం, స్పోర్ట్స్: అండర్-19 ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత బౌలర్లు నేపాల్‌ను 128 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag), లక్ష్య రైచందాని అజేయ అర్ధశతకాలతో భారత్‌కు విజయాన్ని అందించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ లక్ష్య రైచందాని బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత బౌలర్లు ఆరంభం నుంచే నేపాల్‌పై ఒత్తిడి పెంచారు. ఇషాన్ సూద్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అర్జున్ రాజ్‌పుత్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. యశ్వీర్ గౌడ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో నేపాల్ 42.3 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. దర్శ్ సోనార్ 43, ఆశిష్ లుహార్ 29 పరుగులతో రాణించారు.
అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) దూకుడుగా ఆడాడు. కేవలం 52 బంతుల్లోనే 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు కెప్టెన్ లక్ష్య రైచందాని 63 బంతుల్లో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు అజేయంగా 129 పరుగులు జోడించారు. దీంతో భారత్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. టోర్నీలో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్ 8న ఈ మ్యాచ్ జరగనుంది.
Also Read : కొండగట్టు అంజన్న సన్నిధిలో ‘బసవ’ చిత్ర బృందం.. ప్రత్యేక పూజలు
Follow Us On : WhatsApp

