కలం, వెబ్ డెస్క్ః కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దగ్గుతో బాధపడుతున్న ఆమె గంగారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలుష్యం వల్లే అనారోగ్యం బారిన పడినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు, ఛాతీ నిపుణుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ఢిల్లీలో గాలి కాలుష్యం పెరిగిపోతోంది. ఈ కారణంగా సోనియాగాంధీ దగ్గు సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది.
గత కొంతకాలంగా సోనియా గాంధీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. విదేశాల్లో చికిత్స తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ల (Doctors) పర్యవేక్షణలో ఉంటున్నారు. ఇటీవల కాలంలో ఆమె వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటూ, అవసరమైనప్పుడు మాత్రమే ప్రజా కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు.


