కలం, వెబ్ డెస్క్: దీపావళి పండుగను పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి.. పేదల సొంతింటి కల సాకారమైన వేళ, ఈ దీపావళి పండగ శుభవేళ ఇందిరమ్మ ఇళ్లల్లో, లబ్ధిదారుల సొంతింటి సొంతోషంలో నేను సైతం పాలుపంచుకోబోతున్నా. ఈ దీపావళి సందర్భంగా నేను ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకోబోతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, మీరు ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవాలని కోరుతున్నాను’ అని తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
2.21 లక్షల ఇళ్ల నిర్మాణం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను (Indiramma Houses) మంజూరు చేసినట్లు పేర్కొంది. దీనిలో ఇప్పటివరకు 2,21,500 గృహ ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీపావళిని లబ్ధిదారులతో కలిసి జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందుకోసం “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” పేరిట ప్రోగ్రాంను ప్రారంభించి, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీపావళి రోజున మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ఇందిరమ్మ ఇళ్లకు వెళ్లి.. వారికి బహుమతులు అందించి పండుగ జరుపుకోనున్నారు. తద్వారా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటడంతో పాటు పేదలకు గూడు కల్పించాలనే సంకల్పాన్ని ప్రజలకు చాటి చెప్పాలనేది కార్యక్రమ ఉద్దేశంగా సీఎం పేర్కొన్నారు.
Also Read : పోలీసులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

