కలం, వెబ్ డెస్క్ః ఆదిలాబాద్ (Adilabad)లో సోయ రైతులు అందోళన బాటపట్టారు. పంట ఉత్పత్తులను వెంటనే కొనుగోలు చేయాలని బంద్ కు పిలుపునిచ్చారు. తేమ, రంగుమారడం కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో రోడెక్కారు. మంగళవారం ఉదయం నుంచే గోదాముల వద్ద ధర్నాలకు దిగారు. పలు వ్యాపార సంస్థలు మద్దతు తెలిపాయి. అఖిలపక్షం రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. జిల్లావ్యాప్తంగా రైతులు (Farmers) ధర్నాలకు దిగడంతో ఆదిలాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం మద్దతు ధర ఇచ్చినా కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. సోయా ఉత్పత్తులను ప్రభుత్వాలు కొనుగోళ్లు చేయకపోవడంతో వ్యాపారులకు అమ్ముకుంటూ భారీగా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట చేపట్టింది. పంట కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిపై నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. పట్టణ బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


