కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చెత్త ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ని మహేశ్వరం మెడికల్ కాలేజీ విద్యార్థుల ధర్నాలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానే గొప్ప ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేతలను రాత్రికి రాత్రే హౌస్ అరెస్ట్ చేసే ఇంటెలిజెన్స్.. మూడు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తోంది అని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మహేశ్వరం మెడికల్ కాలేజీ పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా ఉందన్నారు. 26 నెలలుగా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, కాలేజీ భవనం అద్దె కట్టకుండా కాబోయే డాక్టర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. లక్ష కోట్లతో మూసీ, ఫ్యూచర్ సిటీ కాడతానంటున్న రేవంత్ మెడికల్ కాలేజీ కరెంటు, నీళ్ల బిల్లులు కట్టడానికి డబ్బులు లేవా అని నిలదీశారు.
Also Read : ఎవరైనా ఆ భూములు కొంటే తీవ్ర పరిణామాలు: కేటీఆర్ హెచ్చరిక
Follow Us On: Youtube

