రాష్ట్ర చరిత్రలోనే రేవంత్​ చెత్త సీఎం: హరీశ్​ రావు

కలం, వెబ్ డెస్క్​: సీఎం రేవంత్​ రెడ్డి(Revanth Reddy)పై బీఆర్​ఎస్​ నేత హరీశ్​ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చెత్త ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ని మహేశ్వరం మెడికల్​ కాలేజీ విద్యార్థుల ధర్నాలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానే గొప్ప ముఖ్యమంత్రి అని రేవంత్​ రెడ్డి సెల్ఫ్​ డబ్బా కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ప్రతిపక్ష నేతలను రాత్రికి రాత్రే హౌస్ అరెస్ట్ చేసే ఇంటెలిజెన్స్.. మూడు రోజులుగా విద్యార్థులు ధర్నా చేస్తుంటే ఏం చేస్తోంది అని హరీశ్​ రావు (Harish Rao) ప్రశ్నించారు. మహేశ్వరం మెడికల్​ కాలేజీ పశువుల కొట్టం కంటే అధ్వాన్నంగా ఉందన్నారు. 26 నెలలుగా కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, కాలేజీ భవనం అద్దె కట్టకుండా కాబోయే డాక్టర్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. లక్ష కోట్లతో మూసీ, ఫ్యూచర్ సిటీ కాడతానంటున్న రేవంత్​ మెడికల్​ కాలేజీ కరెంటు, నీళ్ల బిల్లులు కట్టడానికి డబ్బులు లేవా అని నిలదీశారు.

Also Read : ఎవరైనా ఆ భూములు కొంటే తీవ్ర పరిణామాలు: కేటీఆర్ హెచ్చరిక

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>