మహిళలపై దాడి.. బడంగ్‌పేట్‌లో హైటెన్షన్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్ పరిధిలో బైబిల్ కరపత్రాలు పంచుతున్న ఇద్దరు మహిళలపై జరిగిన దాడి ఘటన (Badangpet Incident) స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. మారుతీనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

ఈ దాడిని నిరసిస్తూ, దానికి వ్యతిరేకంగా ఇరువర్గాలకు చెందిన వందలాది మంది మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ‘జై శ్రీరామ్’, ‘జై జీసస్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>