పులిమామిడి వద్ద లారీ బీభత్సం.. తృటిలో తప్పిన ప్రమాదం

కలం, నల్లగొండ : నల్లగొండ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ఆదివారం భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పులిమామిడి (Pulimamidi) స్టేజి సమీపంలో వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడటంతో అధికారులు, స్థానికులు ఉపశమనం పొందారు. లారీ ఢీకొట్టిన తీవ్రతకు ట్రాక్టర్ రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. అందులోని వడ్ల బస్తాలు చిరిగిపోయి, ధాన్యం రోడ్డంతా చెల్లాచెదురుగా పడిపోయింది.

ప్రమాద తీవ్రతకు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై ధాన్యం నిండిపోవడం, ట్రాక్టర్ అడ్డంగా పడిపోవడంతో స్థానిక రైతులు, ప్రయాణికులు వెంటనే స్పందించారు. రహదారిపై ఉన్న ధాన్యాన్ని పక్కకు తొలగిస్తూ, ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు స్వచ్ఛందంగా శ్రమిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>