వాలీబాల్ పోటీల్లో గురుకుల విద్యార్థినుల ప్రతిభ

కలం, సోన్: సోన్ మండలం పాక్‌పట్ల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (Pakpatla Gurukul School) విద్యార్థినులు వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఆదివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌-17 విభాగంలో జోనల్ స్థాయి పోటీలకు పాఠశాల విద్యార్థులు రుతుజ, వైష్ణవి, జెస్సి, వరోధి ఎంపికయ్యారని ప్రిన్సిపల్ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ నెల 3న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించనున్న పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థినులను అభినందించి, తదుపరి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>