ఆయన లేకపోతే మోదీ ప్రధాని కాలేరు: రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవిలో జ్ఞానేశ్ కుమార్ లేకపోతే మోదీ మళ్లీ ప్రధాని, అమిత్ షా మళ్లీ హోం మంత్రి కాలేరని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ‘మేం ప్రతిపక్షంలోనే ఉన్నా.. ఒక మాట గట్టిగా చెప్పాలనుకుంటున్నా. మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ ఎప్పటికీ తప్పించుకోలేరు. వారిపై కచ్చితంగా న్యాయ పరమైన చర్యలుంటాయి. జ్ఞానేశ్ కుమార్‌కు రాత్రి పూట నిద్ర కూడా పట్టడం లేదు. భయంతో వణికిపోతున్నారు. ఎందుకంటే ఆయన చేసింది చిన్న తప్పు కాదు, పెద్ద నేరం’ అని విమర్శించారు.

చూస్తూ ఊరుకోబోం..

భారత ప్రజాస్వామ్య ఆత్మ వంటి ఓటు హక్కుపైనే జ్ఞానేశ్ కుమార్ దాడికి దిగారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘రాజ్యాంగాన్ని మీరు ధ్వంసం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోబోం. నాకు మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్‌పై వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ, ప్రతి భారతీయుడి గొంతు నాకు అత్యంత ముఖ్యమైంది. అది కులం, మతం కంటే ఎంతో గొప్పది. మేం అహింసా చర్యలకు పాల్పడబోం. ఎవరికీ హాని కూడా తలపెట్టబోం. మేం ప్రేమను పంచే వ్యక్తులం తప్ప ద్వేషాన్ని చిందించే మనస్తత్వం ఉన్నవాళ్లం కాదు. దేశంలోని ప్రతి వ్యక్తి హక్కులను కాపాడే బాధ్యత మాపై ఉంది. అది కచ్చితంగా నెరవేరుస్తాం’ అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>