‘ఆప్’కు బిగ్ షాక్.. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా!

కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (Punjab AAP) కి బిగ్ షాక్ తగిలింది. సనౌర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా,సమానా ఎమ్మెల్యే (మాజీ మంత్రి) చేతన్ సింగ్ జౌరామజ్రా ఆమ్ ఆద్మీ పార్టీ కి రాజీనామా చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ శనివారం ప్రకటించిన 40 మంది అభ్యర్థుల తొలి జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పఠాన్‌మజ్రా తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపగా, జౌరామజ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేస్తూ తన లేఖను పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరాకు పంపించారు.

2027 ఫిబ్రవరి, మార్చి నెలలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి సెకండ్ టర్మ్ గవర్నమెంట్ ఫామ్ చేయాలని ఆప్ సర్కార్ భావిస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఈ ఇద్దరు కీలక నాయకులు వైదొలగడం పంజాబ్ ఆప్ వర్గాల్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>