ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ (PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత వ్యతిరేక శక్తుల నుంచి నిధులు అందుకుంటున్నది ఎవరని ప్రశ్నించారు. నక్సల్స్‌ని అంతం చేశామని.. ఇక దిమాగీ నక్సల్స్‌ని కూడా అంతం చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు. దేశ ఐక్యతను కాపాడేందుకు యజ్ఞంలా ముందుకు వెళ్తామని కుండబద్దలు కొట్టారు.

గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశంలో అస్థిరత సృష్టించేలా కొందరు ప్రయత్నిస్తున్నారని.. ప్రతిపక్షాలు నిరాశలో కూరుకుపోయి దేశానికి విరోధులుగా మారినట్లు విమర్శించారు. గతంలో కంటే ఇప్పుడు భారతదేశంగా మరింత బలంగా మారిందని.. యువతలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. గరీబి హఠావో పేరిట ఓట్లు అడిగినవారు ధనికులయ్యారు తప్ప.. పేదలు అలాగే ఉండిపోయారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శించారు.

పటేల్‌కు రుణపడి ఉండాలి..

తమ హయాంలో 50 కోట్ల మందిని పేదరికంలో నుంచి బయటకు తీసుకురాగలిగామని ప్రధాని మోదీ వివరించారు. 12 ఏళ్లుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో రూపురేఖలే మారిపోయాయని ప్రకటించారు. ఢిల్లీ నుంచి విడుదలయ్యే ప్రతి పైసా పేదలకు చేరుతోందన్నారు. సర్దార్ పటేల్‌కు దేశం రుణపడి ఉంటుందన్నారు. ఆయన కారణంగానే 550 సంస్థానాలు దేశంలో భాగమైనట్లు గుర్తు చేసుకున్నారు. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు దేశాన్ని ఐక్యంగా ఉంచాలనేదే పటేల్ లక్ష్యంగా ఉండేదన్నారు.

చాలా తక్కువ సమయంలోనే తాము పటేల్ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశామన్నారు. నక్సలిజం అంతం కావడం మరో గొప్ప విషయంగా పేర్కొన్నారు. ప్రపంచంలో చాలా దేశాలు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా అభివృద్ధిలో దూసుకెళుతోందన్నారు. చమురు సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>