బియ్యం విక్రయాలు.. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు: చందన్

కలం, ఖమ్మం బ్యూరో: ​జిల్లాలోని రైస్ మిల్లర్లు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు, విక్రయ కేంద్రాలన్నీ బియ్యాన్ని (Khammam Rice Prices) ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకే విక్రయాలు జరగాలని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 26 కిలోల బ్యాగ్ బియ్యానికి వర్తించే ధరలను ఖరారు చేశారు. దీని ప్రకారం బిపిటి కెఎన్ఎం, బియ్యం కిలో రూ. 66, ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా బియ్యం కిలో రూ. 74, అలాగే హెచ్ఎంటీ జెఎస్ఆర్ బియ్యం కిలో రూ. 79 చొప్పున విక్రయించాలని తెలిపారు.

​వ్యాపారులు తమ విక్రయ కేంద్రాల వద్ద ఈ ధరల వివరాలతో కూడిన ప్రభుత్వ బ్యానర్‌ను వినియోగదారులు స్పష్టంగా చూసేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ఆయన స్వయంగా పట్టణంలోని బియ్యం విక్రయ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యాన్ని విక్రయించాలని, ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విక్రయదారులను హెచ్చరించారు.

ధరల పట్టిక ప్రదర్శనలో గానీ, నిర్ణయించిన ధరల అమలులో గానీ ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారులు, ఎవరైనా వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఆ విషయాన్ని వెంటనే జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం, దృష్టికి తీసుకురావాలని ఆ ప్రకటనలో కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>