రాప్తాడు పాఠశాలలో దారుణం.. విద్యార్థినిపై రంపంతో దాడి!

కలం, వెబ్ డెస్క్ : అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాల (Rapthadu School)లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని పై ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పాఠశాల ప్రాంగణంలోనే బాలిక ముఖం, చేతులపై రంపంతో కోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ అటాక్‌ను అడ్డుకోబోయిన మరో బాలికకు కూడా గాయాలయ్యాయి.

వెంటనే స్పందించిన స్థానికులు, సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఇలాంటి ఘటన జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : అర్ధరాత్రి పురిటినొప్పులు.. రోడ్డు లేక 3 కిలోమీటర్లు డోలీలో గర్భిణీ ప్రయాణం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>