ఎల్‌నినో ముప్పు: ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లకు స్పెషల్ ఫండ్స్!

కలం, వెబ్ డెస్క్ : ఎల్‌నినో (El Nino) ప్రభావంతో తలెత్తే తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. సింగూరు (Singur) నీటి అవసరాల నిమిత్తం సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు రూ.120 కోట్లు కేటాయించగా, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క (Minister Seethakka) శనివారం మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

నీటి ఎద్దడి తలెత్తే ప్రాంతాల్లో స్థానిక వనరులను వినియోగించుకోవడం, అవసరమైన చోట బోరుబావులను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి (Minister Seethakka) ఆదేశించారు. మిషన్ భగీరథ సరఫరాలో అంతరాయం ఏర్పడే గ్రామాలు, భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాలను తక్షణమే గుర్తించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అలాగే, వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా ఇంకుడు గుంతలు, మ్యాజిక్‌ పిట్ల నిర్మాణాలను రెండు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో పాటు పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Also Read : తీపి పండించే నేల.. జహీరాబాద్ చెరుకు రైతుల వ్యథ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>