వర్క్ వీసాల పేరుతో లక్షల్లో మోసం.. ఏజెంట్ అరెస్ట్

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇజ్రాయెల్, రష్యా దేశాల్లో వర్క్ వీసాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న నకిలీ ఏజెంటును ఆర్మూర్ పోలీసులు(Armoor Police) అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన షేక్ తాహా.. పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి విదేశాలకు పంపిస్తానని అనుమతులు లేకుండా మహాలక్ష్మి కాలనీలో షైన్ అబ్రాడ్ కన్సల్టెన్సీని నిర్వహిస్తున్నాడు.

కొన్నేళ్లుగా ఆర్మూర్ పట్టణంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, నందిపేట్, వేల్పూర్, జక్రాన్‌పల్లి, మోపాల్ తదితర మండలాలతో పాటు కరీంనగర్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇజ్రాయెల్, రష్యా తదితర దేశాలకు పంపిస్తానని, వర్క్ వీసాలు ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు.

అయితే సరైన వీసాలు ఇవ్వకుండా కొందరికి విజిట్ వీసాలు ఇచ్చి, మరికొందరికి ఇవ్వకుండా పాస్‌పోర్టులను తన వద్దే ఉంచుకొని మోసానికి పాల్పడ్డాడు. దీంతో బాధితులు షేక్ తాహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విచారణ అనంతరం షేక్ తాహా నుంచి కారు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>