గుంటూరులో దారుణం: పసికందు కిడ్నాప్!

కలం, వెబ్ డెస్క్ : గుంటూరు (Guntur) నగరంలో కలకలం రేపిన ఘటన లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఏటుకూరు రోడ్డులోని పాత సామాను దుకాణం ముందు నిద్రిస్తున్న రెండు నెలల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.

ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు ఈ కిడ్నాప్‌నకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అపహరణకు ముందు బాధితులకు, ఆ యువకులకు మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన లాలాపేట పోలీసులు పసికందు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>