వాహ్ సామ్‌.. ప్రెగ్నెన్సీతో జిమ్ వ‌ర్కౌట్స్‌!

క‌లం, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ సమంత (Samantha) ప్రెగ్నెన్సీ జ‌ర్నీ ఎంతో ప్ర‌త్యేకంగా సాగింది. ప్రస్తుతం తొమ్మిదో నెలలో ఉన్న సామ్ త్వ‌ర‌లో పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ కెరీర్‌ను ఎంతో సమతుల్యంగా పంచుకుంటూ ఈ ప్రత్యేక దశను సామ్‌ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్ సమయంలో తెలుసుకుంది. ‘తస్సదియ్య’ పాటను షూట్ చేస్తున్నప్పుడు తనకు ఈ విషయం తెలిసిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయినప్పటికీ ఆమె తన వృత్తిపరమైన బాధ్యతలను ఆపకుండా కొనసాగించింది. ఈ మూవీతోనే ఆమె బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి ఘన విజయాన్ని అందుకుంది.

అలాగే ఏడో నెలలోనూ చెన్నై వెళ్లి ‘సెలెబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళన్’ షో షూటింగ్‌లోనూ పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం సినిమాలే కాకుండా ఫిట్‌నెస్‌కు కూడా ఆమె ఎంతో ప్రాధాన్యతనిచ్చింది. మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు తాను చేసిన వర్కవుట్లకు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పంచుకుంది. డాక్టర్ల పర్యవేక్షణలో తన శరీరానికి తగినట్లుగానే వ్యాయామాలు చేసినట్లు తెలిపింది.

త్వరలోనే తాను మాతృత్వంలోకి అడుగుపెట్టబోతున్నానని, ఈ జీవితాన్ని మార్చే అనుభవం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని త‌న సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అన్ని కమిట్‌మెంట్‌లు పూర్తయిన తర్వాత కొద్దిరోజులు ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకుంటాన‌ని కూడా సామ్ (Samantha) ముందే చెప్పేసింది. ఇక సామ్ నిండు గ‌ర్భిణిగా జిమ్ చేస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Also Read : అభిషేక్, వైభవ్‌కు అన్యాయం.. యువరాజ్ సింగ్​ వార్నింగ్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>