కలం, స్పోర్ట్స్ : అభిషేక్ శర్మ(Abhishek Sharma), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్‌లను భారత వన్డే జట్టులోకి తీసుకోకపోతే వారి ప్రతిభకు అన్యాయం చేసినట్లేనని మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) హెచ్చరించారు. ప్రోటోకాల్ 32 లాంచ్ వేడుకలో మాట్లాడిన ఆయన, ఈ ముగ్గురు యువ ఆటగాళ్లకు 50 ఓవర్ల ఫార్మాట్లో వెంటనే అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఇటీవల వెల్లింగ్టన్ టీ20లో వైభవ్, అభిషేక్‌ల జోడీ పవర్ ప్లేలోనే 118 పరుగులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇంగ్లాండ్ పర్యటనలో సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అతి చిన్న వయస్కుడైన అరంగేట్ర ఆటగాడిగా నిలవగా, న్యూజిలాండ్‌పై అభిషేక్ 35 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ సాధించాడు. గతంలో ఇషాన్ కిషన్ 32 వన్డేలు ఆడినప్పటికీ, అభిషేక్, వైభవ్‌లకు ఇంకా వన్డే ఆడే అవకాశం లభించలేదు. ప్రస్తుతం వన్డే జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఉండటంతో చోటు దక్కడంలో తీవ్ర పోటీ నెలకొందని యువరాజ్ (Yuvraj Singh) అంగీకరించారు. అయినప్పటికీ, అభిషేక్ శర్మ కష్టపడి సాధించిన విజయాలను కొనియాడుతూ, ఈ యువ ఆటగాళ్లకు త్వరలోనే జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read : వాహ్ సామ్.. ప్రెగ్నెన్సీతో జిమ్ వర్కౌట్స్!
Follow Us On : WhatsApp

