వైద్యాధికారులకు యాదాద్రి కలెక్టర్ షోకాజ్ నోటీసులు

కలం, యాదాద్రి భువనగిరి: ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్య పరీక్షలు అందించే టీ-హబ్ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanthi) కఠిన చర్యలకు ఉపక్రమించారు. వైద్య పరీక్షల శాంపిళ్ల సేకరణ నుంచి రిపోర్టుల అందజేత వరకు జాప్యం జరుగుతున్న వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.మనోహర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణ్ రావు, ప్రోగ్రాం ఆఫీసర్ వి.వంశీకృష్ణకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉచిత వైద్య పరీక్షల శాంపిళ్లను సకాలంలో సేకరించకపోవడం, పరీక్షల నివేదికలను నిర్ణీత సమయంలో అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు కలెక్టర్ దృష్టికి వచ్చింది.

వైద్య శాఖలో చర్చనీయాంశం..

బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడంపై అధికారులను వివరణ కోరుతూ కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఒకేసారి వైద్యశాఖకు చెందిన ముగ్గురు కీలక అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ కావడం వైద్యశాఖలో చర్చనీయాంశంగా మారింది. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందనే సంకేతాలను కలెక్టర్ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు ఇచ్చే వివరణపై కలెక్టర్ తదుపరి ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>