epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కవితను కీలు బొమ్మలా ఆడిస్తున్నారు : గొంగిడి సునీత

కలం, వెబ్​ డెస్క్​ : ఎమ్మెల్సీ కవిత వెనుక ఎవరో ఉండి కీలుబొమ్మలా ఆడిస్తున్నారని బీఆర్ఎస్​ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత (Gongidi Suntiha) కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కవిత మాటలు బీఆర్​ఎస్​కు ఇబ్బందిగా మారాయని, ముఖ్యంగా కేసీఆర్ ను కంటతడి పెట్టించడంతో పాటు మానసిక క్షోభకు గురిచేశాయని అన్నారు. పార్టీ చీఫ్​ కేసీఆర్​ ఆదేశాలతో ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీని బాయ్ కాట్​ చేస్తే కవిత మాత్రం సభకు హాజరుకావడాన్ని సునిత తప్పుబట్టారు.

కవిత మనస్ఫూర్తిగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదని అదంతా నాటకమని ఆమె ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్​ పార్టీలో స్వేచ్ఛ లేకపోతే కవిత ఇన్ని పదవులు ఎలా దక్కాయని.. ఓడిపోయినా ఆమెకు కేసీఆర్​ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన విషయాన్ని మర్చిపోకూడదని సూచించారు. కవిత మాటలు కూర్చున్న కొమ్మను నరుక్కునే విధంగా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్​ఎస్​.. భారత రాష్ట్ర సమితిగా మారడం ఇష్టంలేదంటున్నారని.. మరి తెలంగాణ జాగృతి పేరును భారత జాగృతి గా ఎలా మార్చారని సునిత నిలదీశారు. బీఆర్ఎస్​ ను ఆగం చేయడానికి కవిత కంకణం కట్టుకుందని ఆమె ఆరోపించారు. కవిత లిక్కర్​ కేసులో ఇరుక్కున్నప్పుడు కేటీఆర్​, హరీశ్​ రావు వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లూ ఆమె కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కవిత పార్టీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని సునీత ధ్వజమెత్తారు.

Gongidi Sunitha
Gongidi Sunitha

Read Also: కవిత పార్టీ ప్రకటనపై బీజేపీ స్పందన ఇదే..

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>