epaper
Friday, January 16, 2026
spot_img
epaper

బీఆర్ఎస్​​ తెలివి తక్కువ పనితో తెలంగాణకు భారీ నష్టం : ఉత్తమ్​

కలం, వెబ్​ డెస్క్ : బీఆర్ఎస్​​ తెలివి తక్కువ పనితో తెలంగాణకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. గతంలో ఆగిఉంటే అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో చిట్​ చాట్​ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation) ఆగింది అని, తాము ఒత్తిడి చేయడం వల్లే ఏపీ ప్రభుత్వం నిర్మాణ పనులను ఆపేశారని చెప్పారు.

కృష్ణా – గోదావరి జలాల్లో విషయంలో బీఆర్​ఎస్​ అతి తెలివి చూపి.. పని మాత్రం తక్కువ చేసిందని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలంకి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం ప్రాజెక్టులను మార్చి రాష్ట్రానికి భారీ నష్టం చేశారన్నారు. పోలవరం – నల్లమలసాగర్ ప్రాజెక్టును తాము అన్ని ఫోరమ్​ లలో వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) చూపిస్తున్న లేఖ దీనికి సంబంధించినది కాదన్నారు. పోలవరం- నల్లమల ఇంటర్ స్టేట్ రూల్స్ కు వ్యతిరేకమని జీఆర్ఎంబీకి లేఖ రాశామని, తమ అభిప్రాయాన్ని కూడా జీఆర్​ఎంబీ సమర్థించిందన్నారు. ఈ ప్రాజెక్టులను మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. పోలవరం – నల్లమల ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపడానికి సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్​ సింఘ్వీకి సూచించామన్నారు.

ఈ కేసును సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసిందని చెప్పారు. రిట్​ పిటిషన్​ లో కాదు సూట్​ పిటిషన్​ లో రావాలని తమకు సుప్రీంకోర్టు సూచించిందని తెలిపారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని కోరడానికి తానే నేరుగా హాజరవుతానని వెల్లడించారు. మరోసారి న్యాయవాదులతో సమావేశం అవుతానని ఉత్తమ్ తెలిపారు.

Uttam Kumar Reddy
Uttam Kumar Reddy

Read Also: ‘క్లాట్’​ పేపర్​ లీక్​.. సుప్రీంలో పిటిషన్​ దాఖలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>