కలం, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)కు విజయ్ హజారే ట్రోఫీలో కీలక బాధ్యతలు దక్కాయి. ముంబై జట్టు కెప్టెన్సీ బాధ్యతలను యాజమాన్యం శ్రేయస్రే అందించింది. గాయంతో టోర్నమెంట్‌కు దూరమైన శార్దూల్ ఠాకూర్ స్థానంలో శ్రేయస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. జనవరి 6, 8 తేదీల్లో జరిగే లీగ్ దశ రెండు మ్యాచ్‌లకు శ్రేయస్.. ముంబై జట్టుకు నాయకత్వం వహించనున్నారు. నాకౌట్ మ్యాచ్‌లలో ఆయన పాల్గొనడం మాత్రం అనిశ్చితంగా ఉంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టులో శ్రేయస్ ఎంపిక కావడంతో, ఫిట్నెస్ ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్స్ జనవరి 12 నుంచి 18 వరకు జరగనున్నాయి. వన్డేలకు అనుమతి లభిస్తే శ్రేయస్ (Shreyas Iyer) నాకౌట్స్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అప్పుడు ముంబై మరో కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబర్‌లో భారత్–ఆస్ట్రేలియా మూడో వన్డేలో క్యాచ్ పట్టే ప్రయత్నంలో శ్రేయస్‌కు గాయం అయ్యింది. ఆ గాయం తర్వాత విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆయనకు తొలి పోటీ మ్యాచ్‌లు కావడం విశేషం. ప్రస్తుతం ముంబై.. గ్రూప్-Cలో రెండో స్థానంలో ఉంది. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో, జనవరి 8న పంజాబ్‌తో జైపూర్‌లో జరిగే మ్యాచ్‌ల్లో ముంబై తలపడనుంది.
Read Also: టీమిండియా క్రికెటర్‌కి ఈసీ నోటీసులు
Follow Us On: Youtube


