కలం వెబ్ డెస్క్ : US Murder Case | అమెరికాలోని కొలంబియాలో తెలుగు యువతి నిఖిత గోడిశాల (Nikitha Godishala)ను హత్య చేసిన నిందితుడు అర్జున్ శర్మ (Arjun Sharma)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తమిళనాడులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఇంటర్ పోల్ పోలీసులు వెల్లడించారు. జనవరి 2న నిఖిత అదృశ్యమైనట్లు అర్జున్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఇండియాకు వచ్చేశాడు. ఫిర్యాదు చేసిన రోజే దేశం నుంచి వెళ్లిపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది.
జనవరి 3న అతడి అపార్ట్మెంట్లో తనిఖీ చేయగా నిఖిత మృతదేహం లభ్యమైంది. దీంతో అర్జున్ శర్మపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి, అతడి కోసం గాలించారు. చివరికి తమిళనాడులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అర్జున్ డబ్బు కోసమే నిఖితను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అమెరికాకు అప్పగించేందుకు అధికారిక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Read Also: అమెరికాలో మరో విషాదం.. ఎన్నారై దంపతులు మృతి
Follow Us On: Instagram


