కలం, వరంగల్ బ్యూరో : తెలంగాణకు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ఓ అభిమాని (KCR Fan) శబరిలకు పాదయాత్రగా బయలుదేరారు. తెలంగాణ ఉద్యమకారుడు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చాగంటి రమేశ్ తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ (KCR) పై అభిమానాన్ని చాటుకున్నారు. అయ్యప్ప స్వామి మాల ధరించి 101 రోజు పూర్తి అయినా సందర్భంగా ఇరుముడితో శబరిమలకు బయలుదేరారు.
పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చిన్న పాదంతో వెళుతున్న మార్గంలో తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ భారీ మెజారిటీతో దాస్యం వినయ భాస్కర్ గెలుపొంది మంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెత్తిన ఇరుముడితో చేతిలో ఫ్లెక్సీ తో పాదయాత్ర గా వెళ్లారు. పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు చేరుకొని మొక్కలు తీర్చుకున్నారు. ఆయన వెంట రుద్రోజ్ సంపత్, పలువురు అయ్యప్ప స్వాములు ఉన్నారు.
Read Also: కేటీఆర్ పర్యటనకు ముందే బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
Follow Us On: Sharechat


