ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శలు గుప్పించారు. వాళ్లు పార్టీలే కాదు.. మాటలు కూడా ఫిరాయిస్తున్నారని చురకలంటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్(Danam Nagender) పేరు ఉండటంపై కేటీఆర్ స్పందించారు. ‘‘దానం ఏ పార్టీ గుర్తుపైన గెలిచారు. ఏ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్నారు. మా పార్టీలో గెలిచినోళ్లను తీసుకుని ఆ పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో పెట్టారు. స్పీకర్ దగ్గరకు వెళ్తే తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్తున్నారు. అలా అయితే కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో దానం పేరు ఎలా వచ్చింది?’’ అని ప్రశ్నించారు కేటీఆర్.
అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ పార్టీ 40 క్యాంపెయినర్ల పేర్లను ప్రకటించింది. అందులో దానం నాగేందర్ పేరు కూడా ఉంది. ఆయన కాంగ్రెస్ తరుపున ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్(KTR) పలు విమర్శలు చేశారు.
Read Also: ‘మద్యం ఆదాయంపై ద్యాస తప్ప ప్రజల ఆరోగ్యం పట్టదా..?’

