కలం, వెబ్ డెస్క్: ఏపీ స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. దర్శి మున్సిపాలిటీ (Darsi Municipality)ని కైవసం చేసుకుంది. ఇక్కడ 28 వార్డుల్లో కూటమి అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన దారం సుబ్బారావు విజయం సాధించారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 మున్సిపాలిటీలు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లలో పోటీ చేస్తోంది. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబుతో జనసేన పార్టీ కీలక నేతలు మరోసారి భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులు ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, జడ్పీ స్థానాలపై అవగాహనతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.
Also Read : జనసేనకు డిపాజిట్ రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో వైరల్!
Follow Us On: X(Twitter)

