హమాలీల సంక్షేమ చట్టంపై కార్మిక సంఘం డిమాండ్

కలం, నిర్మల్‌ : హమాలీ కార్మికులకు (Hamali Workers) సంక్షేమ చట్టం అమలు చేయాలని సివిల్‌ సప్లై హమాలీ కార్మిక సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ మాజీ ప్రధాన కార్యదర్శి, సివిల్‌ సప్లై హమాలీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. బాలరాజు, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌. విలాస్‌, కె. శ్రీనివాస చారి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

హమాలీ కార్మికుల ఐక్య పోరాటాల ఫలితంగానే కూలీ రేట్లు పెంచుకోగలిగామని తెలిపారు. ఏఐటీయూసీ ఎర్రజెండా ఆధ్వర్యంలో చేసిన పోరాటాల వల్ల బోనస్‌, కుట్టుకూలి, మహిళా కార్మికుల కూలీ పెంపు సాధ్యమైందన్నారు. హమాలీ కార్మికులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు పుండలిక్‌, సాయి, పిట్టల భీమేశ్‌, ఘంచక్కర్‌ శివాజీ, పిల్లి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>