నవంబర్ 5న కరీంనగర్‌లో ర్యాలీ: ప్రవీణ్ రావు

కలం, కరీంనగర్: సర్ ప్రక్రియపై ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలా నవంబర్ 5న కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు (Boinapally Praveen Rao) తెలిపారు. దీనికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ హాజరవుతున్నారని వివరించారు. ఈ ర్యాలీలో యువత, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తపల్లి మండలంలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ప్రవీణ్ రావు వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోంది..?

సర్ ప్రక్రియలో భాగంగా నకిలీ ఓట్లను, మరణించిన వారి ఓట్లను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తుంటారని ప్రవీణ్ రావు తెలిపారు. 1952, 1957, 1961, 1965-66, 1983-84, 1987-89, 1992-95, 2002-2004 సంవత్సరాల్లో కూడా ఈ సవరణలు జరిగాయన్నారు. సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ 2025-2026లో ఈ ప్రక్రియ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోయిందని, నకిలీ ఓట్ల తొలగింపును కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుంట తిరుపతి, శక్తి కేంద్ర ఇన్‌ఛార్జి వేముల అనిల్ కుమార్, బూత్ అధ్యక్షులు ఎగ్గొజు సంపత్ చారి, బోనాల పరశురాము, గ్రామ సర్పంచి నునుగొండ మానస ప్రవీణ్, వార్డు మెంబర్లు రుద్ర రాజ్ కుమార్, పెంట సురేష్, సీనియర్ నాయకులు మెరుగు మల్లేశం, వరాల మల్లేశం, పెంటి సంతోష్ కుమార్, గీ గురు చందు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>