జ‌న‌సేన‌కు డిపాజిట్ రావొద్దు.. మంత్రి నారాయ‌ణ ఆడియో వైర‌ల్‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల (Local Body Elections) వేళ మంత్రి పొంగూరు నారాయ‌ణ (Minister Narayana) పేరుతో ఓ ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కూట‌మి పొత్తులో భాగంగా నెల్లూరులో ప‌లు స్థానాల‌ను జ‌న‌సేన‌కు కేటాయించారు. అయితే ఆయా స్థానాల్లో జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను ఓడ‌గొట్టాలంటూ నారాయ‌ణ మాట్లాడిన‌ట్లుగా ఓ ఆడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెల్లూరులోని 6వ డివిజన్‌లో జనసేన అభ్యర్థిని ఓడించాలని, ఆ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కకూడదని మంత్రి ఆదేశించినట్లు ఆ ఆడియోలో ఉంది. అయితే ఈ ఆడియో నిజమైనదా? అందులోని గొంతు మంత్రి నారాయణదేనా? అనే అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

పొత్తులో భాగంగా నెల్లూరులో నాలుగు డివిజన్లలో పోటీ చేసేందుకు జనసేన అంగీకరించింది. ఆ పార్టీకి అభ్యర్థి లేని 7వ డివిజన్‌ను టీడీపీ కేటాయించిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ వైఖరికి వ్యతిరేకంగా జనసేన 6వ డివిజన్‌లో అభ్యర్థిని బరిలోకి దించినట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా వైరల్‌గా మారిన ఆడియో కూటమిలో చర్చకు దారితీసింది. మంత్రి నారాయణ (Minister Narayana) తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన నాయకత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. మ‌రోవైపు కొంద‌రు టీడీపీ నేత‌లు అది ఫేక్ ఆడియో క్లిప్ అని, మంత్రి నారాయ‌ణ‌కు అలా మాట్లాడే ప్ర‌స‌క్తే లేదని అంటున్నారు. కూట‌మిలో గొడ‌వ‌లు సృష్టించేందుకే కొంద‌రు అలాంటి ఫేక్ ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు.

Also Read : యలహంక ప్యాలెస్ వివాదంలో కీలక మలుపు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>