epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

తీన్మార్ మల్లన్న ప్రశ్నకు మంత్రి పొన్నం రియాక్షన్ ఇదే

కలం, వెబ్ డెస్క్: సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిగాయి. విదేశీ విద్య, స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్‌, గురుకులాల ఖర్చులు, రాజీవ్ యువ వికాసం చర్చకొచ్చాయి. ఈ అంశాలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సమాధానమిచ్చారు. ‘‘బలహీన వర్గాలకు సంబంధించి 11 వేల కోట్లు కేటాయించినప్పటికీ 2400 కోట్లు ఖర్చు అయింది. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సంక్షోభం వల్లే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి.. దానిని అధిగమిస్తూ మిగిలిన పథకాలు కార్యక్రమాలు అమలు జరుగుతుంది. విదేశీ విద్య స్కాలర్షిప్ లు గతంలో 300 మందికి ఇచ్చేది ఇప్పుడు 700 మందికి ఇస్తున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే వారికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. 100 నియోజకవర్గాల్లో ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి 200 కోట్లు ఖర్చు చేస్తూ నిర్మాణం జరుగుతుంది’’ అని మంత్రి పొన్నం వివరించారు.

‘‘బలహీన వర్గాలకు సంబంధించి దాదాపు 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. యువత (youth)కు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి రాజీవ్ యువ వికాసం పథకం తెచ్చాం.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా అమలు చేయలేదు. గత 10 సంవత్సరాల్లో కనీసం 2400 కోట్లు ఖర్చు కూడా చేయలేదు. బలహీన వర్గాల సంబంధించిన కార్యాచరణ ,కార్యక్రమాల అమలు సంబంధించి బలహీన వర్గాల ప్రజా ప్రతినిధుల తో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంక్లూజీవ్ గ్రోత్ లో బలహీన వర్గాలది కీలక పాత్ర ఉంది. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందించడంలో ఆలస్యం కావడం లేదు… జిల్లాల్లో కొంత వెరిఫికేషన్ ఆలస్యం అవుతుంది.. గ్రీన్ ఛానెల్ ద్వారా చెక్కులు అందిస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘గీతా వృత్తిదారులకు కాటమయ్య 10 వేల చొప్పున మూడు దశల్లో కిట్స్ అందించాం. బలహీన వర్గాల విద్య , ఉపాధి , రాజకీయ అవకాశాలు మెరుగుపర్చడానికి కుల సర్వే చేశాం.. అందులో నివేదిక ద్వారా అభివృద్ధి చేసుకుంటాం. విద్య పటిష్టంగా ఉంటేనే ఆ కుటుంబం సమాజం అభివృద్ధి జరుగుతుంది. గతంలో మెస్ చార్జీలు, అద్దె భవనాల పేమెంట్ ఆలస్యమెయ్యేది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడానికి ఇప్పుడు మేము మెస్ చార్జీలు పెంచాం.. గురుకులాల హాస్టల్ అద్దెలు కూడా గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ప్రజా పాలన ప్రభుత్వం (Congres Govt) లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బిల్లుల చెల్లింపు ఎక్కడ ఆలస్యం లేదు’’ అని మంత్రి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>