epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కోమా నుంచి తేరుకున్న స్టార్ క్రికెటర్

కలం, వెబ్ డెస్క్:  ఆస్ట్రేలియా మాజీ స్టార్ బ్యాటర్ డామియన్ మార్టిన్ (Damien Martyn) కోమా నుంచి బయటకు వచ్చాడు. మెనింజైటిస్‌తో తీవ్ర అస్వస్థతకు గురై కృత్రిమ కోమాలోకి వెళ్లిన మార్టిన్ ఇప్పుడు స్పృహలోకి వచ్చాడు. ఈ విషయాన్ని అతని మిత్రుడు, మాజీ వికెట్‌కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ వెల్లడించాడు. గత వారం హఠాత్తుగా అనారోగ్యానికి గురైన 54 ఏళ్ల మార్టిన్‌ను ఆసుపత్రికి తరలించగా మెనింజైటిస్‌గా వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్య బృందం అతన్ని ఇండ్యూస్‌డ్ కోమాలో ఉంచింది. అయితే గత రెండు రోజులుగా పరిస్థితి అనూహ్యంగా మారిందని గిల్‌క్రిస్ట్ తెలిపారు. ప్రస్తుతం మార్టిన్ మాట్లాడుతున్నాడని చికిత్సకు మంచి స్పందన ఇస్తున్నాడని చెప్పారు.

మార్టిన్ (Damien Martyn) కోలుకోవడాన్ని కుటుంబ సభ్యులు ఒక అద్భుతంలా భావిస్తున్నారని గిల్‌క్రిస్ట్ తెలిపారు. అతని ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతుండటంతో త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ విభాగానికి తరలించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా కొంత వైద్య పర్యవేక్షణ అవసరం ఉన్నా పరిస్థితి సానుకూలంగా ఉందన్నారు. అభిమానుల నుంచి వస్తున్న మద్దతు మార్టిన్‌కు మరింత ధైర్యం ఇస్తోందని చెప్పారు. డామియన్ మార్టిన్ ఆస్ట్రేలియా క్రికెట్‌కు విశేష సేవలందించాడు. 67 టెస్టులు 208 వన్డేల్లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించాడు. 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్‌పై అజేయంగా 88 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2006 యాషెస్ సిరీస్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్టిన్ అప్పటి నుంచి ప్రశాంత జీవితం గడుపుతున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>