జపాన్(Japan) దేశానికి తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు సనే తకైచీ(Sanae Takaichi).. శనివారం జరిగిన ఎన్నికల్లో వ్యవసాయశాఖ మంత్రి షింజిరో కోయిజుమిపై విజయం సాధించారు. జపాన్‌లో అధికార పార్టీ అధ్యక్షుడే ప్రధాని అవుతారు. కానీ పార్టీలో చెలరేగిన తిరుబాటుతో ఇది మారింది. ఈ తిరుగుబాటులో భాగంగానే ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ప్రధాని పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో తకౌజీ విజయం సాధించారు. ఇప్పుడు జపాన్ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు. అతి త్వరలో ఆమె ప్రమాణ స్వీకారం జరగనుంది.
అయితే గతేడాది జరిగిన Japan పార్లమెంట్ ఎన్నికల్లో ఎల్‌డీపీ ఓడిపోవడంతో షిగెరు నాయకత్వంపై పార్టీ నాయకల్లో అసంతృప్తి ఏర్పడింది. షిగెరుపై విశ్వాసం కోల్పోయారు. అదే తిరుగుబాటుకు కారణమైంది. కాగా ప్రధానిని ఎన్నుకునే దిగువ సభలో ఎల్‌డీపీ అతిపెద్ద పార్టీ కావడంతో తకైచీ.. ఎన్నిక ఖరారయింది.
Read Also: జీతాలు వచ్చి నాలుగు నెలలు.. గోడు వెల్లబోసుకున్న వైద్య సిబ్బంది

