కలం, వెబ్ డెస్క్: అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో ఎన్నారై దంపతులు మరణించారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. 2:30 గంటల ప్రాంతంలో మద్యం తాగిన ఓ ట్రక్ డ్రైవర్ రాంగ్ రూట్లో వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణ కొటికలపూడి, అతని కుటుంబం ఘోరమైన ప్రమాదానికి గురయ్యారు. కృష్ణ కిశోర్, అతని భార్య ఆశ (NRI Couple) తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ చనిపోయారు. వారి మృతదేహాలను మేరీల్యాండ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో ఉంచినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. వీరిది ఏపీలోని పాలకొల్లు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల విదేశాల్లో ఇండియన్స్ (Indians) ఆకస్మికంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. వరుస ఘటనలు జరుగుతుండటంతో భారతీయుల్లో భయం నెలకొంది.


