కలం వెబ్ డెస్క్ : అస్సాం(Assam)లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం ఈ భూకంపం ఉదయం 4:17 గంటలకు సంభవించింది. భూమి లోపల 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది. ఇది అస్సాంలోని మోరిగావ్(Morigaon) జిల్లా సమీపంలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతం కోపిలి ఫాల్ట్ లైన్‌లో ఉంది. గతంలో కూడా ఇక్కడ చాలా భూకంపాలు వచ్చాయి. భూకంప ధాటికి మోరిగావ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. కానీ, ఇప్పటి వరకు ఎక్కడా ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు. ఈశాన్య భారత్(Northeast India), ముఖ్యంగా అస్సాం(Assam) దేశంలోనే అత్యంత భూకంప సున్నిత ప్రాంతంలో ఉంది. అందుకే ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి.


