తమకు నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, దాని వల్ల ఇల్లు గడవడం కూడా కష్టమవుతోందంటూ ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానా వైద్య సిబ్బంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం ఈ దవాఖానాను మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సందర్శించారు. అక్కడ అందుతున్న సదుపాయాలు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనతో సిబ్బంది తమ సమస్యలు వివరించారు. తమకు నాలుగు నెలల నుంచి జీతం రాలేదని తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బస్తీ దవాఖానాల్లో పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరితగతిన అందించాలని ప్రభుత్వాన్ని కోరతామని హరీష్ రావు చెప్పారు. వైద్య సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ ముందుంటుందని అన్నారు.
Read Also: దీపావళి వేడుకల్లో 70 మందికి గాయాలు..

