దీపావళి పండుగను దేశమంతా అట్టహాసంగా జరుపుకుంటోంది. దీపావళి తొలిరోజు బాణా సంచా కాలుస్తూ హైదరాబాద్(Hyderabad)లో 70 మంది గాయపడినట్లు సమాచారం. వీరిని సరోజిని దేవి ఆసుపత్రిలో చేర్చించారు. బాధితుల్లో 20 మంది చిన్నారులు ఉన్నారు. ఇద్దరిని ఇన్ పేషెంట్లుగా చేర్చుకున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. వారి పరిస్థితిని ఈరోజు పరిశీలించి అవసరం అయితే వారికి బుధవారం సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారు. బాణాసంచా కాల్చే సమయంలో రసాయనాలు పడి అనేక మంది బాధితులు ఈ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇంకా చిన్నాచితకా గాయాలయ్యి ఆసుపత్రికి రాని వారు కూడా చాలా మంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
Hyderabad | దీపావళి వేడుకల్లో బాణాసంచా కాల్చేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా బాణాసంచా మందులను చేతిలో పట్టుకుని కాల్చడం వంటివి చేయొద్దని అధికారులు చెప్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు.
Read Also: రాజ్‌గోపాల్ రెడ్డి, జూపల్లి మద్య మద్యం మంటలు చెలరేగనున్నాయా..!

