కలం, వెబ్ డెస్క్ : పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకుడు, సర్పంచ్ (AAP Sarpanch) ను దుండగులు కాల్చి చంపడం కలకలం సృష్టించింది. తరణ్‌తరణ్ జిల్లాకు చెందిన సర్పంచ్ జర్మల్ సింగ్ (Jarmal Singh) ఆదివారం ఓ పెళ్లి వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు పెళ్లి వేడుకల్లోకి చొరబడి సినీ ఫక్కీలో కాల్పులు జరిపారు. తలకు బుల్లెట్ తగలడంతో జర్మల్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన చనిపోయాడు. కాల్పులతో ఒక్కసారిగా పెళ్లి వేడుకల్లో విషాదం నిండిపోయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సర్వన్ సింగ్ ధున్ కూడా పెళ్లి వేడుకల్లో ఉండగానే ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 15న మొహాలీలో టోర్నమెంట్ సందర్భంగా ముగ్గురు దుండగుల కాల్పుల్లో కబడ్డీ ప్లేయర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్ని వారాలకే సర్పంచ్ జర్మల్ సింగ్‌ను కూడా దుండగులు కాల్చి చంపడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, గుర్తు తెలియని దుండగలు జర్మల్ సింగ్ పై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: దీదీకి షాక్.. నందిగ్రామ్‌లో బీజేపీ స్వీప్
Follow Us On : WhatsApp


