కలం, వెబ్ డెస్క్ : వారణాసి(Varanasi)లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. చలి నుండి తన బిడ్డని కాపాడాలని తల్లి కప్పిన దుప్పటి వల్ల పసి ప్రయాణం పోయింది. వారణాసి లో రాహుల్ కుమార్, సుధా దేవి దంపతులకు 25 రోజుల క్రితం పుట్టిన పసిబిడ్డ చలి తీవ్రత వల్ల బలైపోయింది.
గడ్డకట్టే చలి తీవ్రత నుండి తన బిడ్డను రక్షించేందుకు తనతో పాటే బలంగా దుప్పటి కప్పి పడుకుంది. దీనితో మందమైన దుప్పటి మూలంగా ఊపిరాడక తెల్లవారేసరికి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. ఈ విషయం తెలిసిన పెద్ద సంఖ్యలో స్థానికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.పెళ్ళయిన రెండేళ్లకు పుట్టిన తొలి బిడ్డను కోల్పోవడం ఆ కుటుంబానికి తీవ్ర మానసిక శోభను మిగిల్చింది.


